నాడెపుడో ఈ ప్రకృతి ఒడిలో
నే దాచుకున్న జ్ఞాపకాలతో
ఏళ్ళు గడిచినా
నన్నొదిలి పోనంటుంది
నా బాల్యం.
*******
ఎన్నో మహా సంగ్రామాల తర్వాత కూడా
శాంతి విలువ తెలుసుకోలేని
సముజ్జీలైన మహాయోధులం
నేను నా మనసు.
*******
బాల్యం వీపున
వృద్ధాప్యం గుండెన
మోయలేని బరువే మోస్తునాయి.
*******
ఫాషనో తీరిక లేకనో
ఏదైతేనేం అమ్మాయిల జడ నుండి
జారా పూలజడ కూడా
ఓ నాటి జ్ఞాపకమైపోయింది.
*******
బాల్యం ఎప్పటికి తీపి స్మృతే!బాల్యం ఫై ఒక సారి నాకవితను చూడగలరు.
ReplyDelete