ఎన్నాళ్ళ కాఠిన్యమో
వదలిపోయిందని
ప్రతీక్షణం అదే తీరుగా
నాట్యమాడుతూ ఆ శిల్పం
నా కంటికి నిశ్చలంగా కన్పిస్తోంది.
********
వెన్ను చూపుతూనే
తనతో మహాసంగ్రామం చేస్తున్న
ఆ మిణుగురు యోధుని
ఓ రెప్పపాటు కాలం
తల వంచి గౌరవిస్తోంది
చీకటి.
*********
బద్దలయ్యేదాకా
దిక్కులు చూడలేదు
ఆ నీటిబొట్టు.
*******
వెన్ను చూపుతూనే
ReplyDeleteతనతో మహాసంగ్రామం చేస్తున్న
ఆ మిణుగురు యోధుని
ఓ రెప్పపాటు కాలం
తల వంచి గౌరవిస్తోంది
చీకటి వహ్వా! చక్కని భావావేశం ఉంది!