లోకమెంతో మెచ్చి
ఇంకా ఇంకా కావాలనుకునే ముత్యాలు
మా కన్నీరంటూ
ఏడుస్తూ సాగాడా బాల వటుడు.
*****
ఇంకని గంగను మోసినోడు
శివుడైతే
జంట జీవ నదులను
నీ కంట మోసే నిన్నేమనాలో
ఓ బాల శ్రామికా.
*******
కనికరం తగ్గి
సగం బరువును
తడి ఆరని నీ మోమునే
దింపుకుంటుంది
ఈ భూమి.
*******
ఆగి ఆగి జారితే
దారెక్కడ మరుస్తామో అని
ఆగక ఏకధారగా కురుస్తాయి
మా కన్నీళ్ళంటూ
బరువు నెత్తిన పెట్టుకు పోయాడా
బాల వీరుడు
గుండె బరువుతో అడుగుపడక నేనాగిపోయా.
******
మంచి కవిత .బాల కార్మికుల ఫై ,బాల్యం ఫై కవితలు నా బ్లాగు లో గమనించగలరు.
ReplyDelete