Thursday, April 19, 2012

నటి 

కప్పుకోవాలనిపించి  ఆ రోడ్డే
ఎండమావిని నేయించుకుంటే
మరి ఆ నటికేమయిందోయ్
అలా విప్పుకుని  రోడ్డెక్కేస్తుంది.
********
మనసునూపి  
సేదదీర్చే సంగీతం
మనిషినూపి
స్వేదం పట్టించేదైంది
ఆ వెండి తెరపై.
*******
రెండు బోసినోళ్ళ మధ్య
లేస్తూ పడుతూ అలా అలా సాగే
తరంగమేనోయ్
జీవితమంటే.
********
రోడ్డుకు
వసంత శోభనిస్తుంది
ఆ ఎండమావి.
*******

1 comment:

  1. రెండు బోసినోళ్ళ మధ్య లేస్తూ పడుతూ అలా అలా సాగే తరంగమేనోయ్ జీవితమంటే చాలా బాగా చెప్పారండి! నాకు ఈ లైన్ బాగా నచ్చింది!

    ReplyDelete