నాడలా-నేడిలా
నాడు! ఆ బుడ్డోడి చేతిలో నలుగుతూ వాడితో పాటుగా
అంబరమంతటి ఆనందాన్ని అనుభవించిందీ నాకు జ్ఞాపకమే
మారాలు పోయే గారాలపట్టీలకంది
షావుకారు కొట్టుకి షికారెళ్లి0దీ నాకు జ్ఞాపకమే
జారి నేలపై పడి నేను టాంగుమంటే గాబరాగా
నన్ను వెతుకుతూ తల్లడిల్లిపోయిన గుండెలెన్నో నాకు జ్ఞాపకమే
శ్రీమంతుల మొదలు బుద్ధిమాంధ్యుల గుండె చప్పుళ్ళను విన్నదీ నాకు జ్ఞాపకమే
కానీ నేడు ఒంటిగా బుడ్డోడి చేతిలో పడ్డానో! నేలకేసి కొట్టేస్తున్నాడు
నేల తగిలి చప్పుడు చేస్తూ నే రోదిస్తున్నా
నన్ను గుండెలకు హత్తుకునే వాడే లేడు
శ్రీమంతుడికే కాదు కదా మతిలేని ధీమంతులకు కూడా
అక్కరకు రాని చుట్టాన్ని నేనిపుడు
మారిన ఈ కాలాన తళ తళలాడే రూపమైతే నాకొచ్చింది గానీ
నాటి విలువ పోయి వెలవెలలాడుచుంటి
చెల్లని రూపాయినై.
*********
nice
ReplyDeletethank you
Delete