నీవు
నా తొలిచూపు లోనే నిన్నెంతగా చూసాయో నా కళ్ళు
లోకంలోని అణువణువులో నిన్నే మేల్కొల్పుతున్నాయి
ఒక్క పిలుపపైనా పిలువలేదు సైగైనా చేయలేదు
నడిచి వెళ్ళిన నీ దారిలో గురుతైనా వదలలేదు
కానీ నిన్నే చేరింది నా మనసు
అన్నింటా నిన్ను వెదకడమే దానికి తెలుసు
నీ మౌనం నన్ను తాకితే నిన్ను పిలువను పలువరించను
నీ మౌనాన్ని నా గుండెలో నింపుకుని ఊరుకుంటాను
నా చూపులు నిన్ను కరిగిస్తాయని
నీ హృదయాన్నవి పలకరిస్తాయని నాకు తెలుసు
తప్పదు నీ మౌనాలు మాటలై నాపై హిమవర్షం కురవకపోదు
మన మాటలతో కొత్త మమతా మతమై లోకాలన వెలగకపోదు
నీకై కలలు గనేంతలో నాకై నిజంగా ఉదయిస్తున్నావు
నీకై దూరాలలో వెతికేంతలో నా హృదయంలో బదులిస్తున్నావు
నీకై నే చేరేంతలో నా అడుగులో అడుగు వేస్తున్నావు.
***********
సెకండ్ వన్ బాగా నచ్చింది .
ReplyDeleteఅన్నీ కూడా చాలా బావున్నాయి .
vanaja garu thank you very much
Deletechaalaa chaalaa baavundi chakkani kavita andi
ReplyDeletemanju garu welcome to the blog and thank you very much
Delete