ఆత్మీయతాగంధం
పదపదమని పరుగెట్టిస్తూ!
అంతలోనే ఆగాగంటూ ఆపేస్తూ
తనలోకి రాలిపడిన ఆ పండుటాకులోని
ఆత్మీయతాగంధాన్ని, తన గుండెలో
ఎలా దాచుకుందో ఈ యేరు.
*******
అనురాగపు పిపాస
నన్ను అడగాల్సిన నా యోగక్షేమాలను
నా అడుగులనడుగుతూ వాటి
అనురాగపు పిపాసనెలా తీర్చుకుంటున్నాయో చూడు
కడలి తీరాన ఆ అలలు.
*******
కాన్వెంటుల్లో
కాళీయునిలా
ఆ తాత బొజ్జెపుడూ సిద్ధమే
మధించే మనవడి కృష్ణ పాదాలెక్కడ?
*******
శంఖం
జీవితకాలం పాటూ
ఘోషను అవపోసన పట్టి
నా చెవిలో ఇన్ని గాంధర్వాలను
తానెలా పాడగలుగుతోంది. ఈ శంఖం.
*******
No comments:
Post a Comment