తల్లి
ఒడి లోకి వాడు తెస్తున్న
నవ్వుల వసంతాన్ని వర్ధిల్లమంటూ
తన కన్నుల!
శిశిరాక్షతలను చల్లుతుందా తల్లి.
**
ఎదలోని విషాదాన్ని
ఒడిలోని నవ్వులపై ఒంపితే!
ఆమె తల్లెందుకు ఔతుందోయ్!
**
సూది మందు
ఎంతగా బాగుపడిందో చూసావా!
ఆ బీడు ఆరోగ్యం
సూదిమందు వేసే సరికి ఆ వాన చినుకులు.
******
ఉరుము
పైకి రమ్మంటూ ఈ పుడమిని!
మెరుపంతటి కాలిబాటలు వేసి ఆహ్వానిస్తే
ఒక్కసారి కూడా రాదేమంటూ
అలా అరుస్తుంటుంది! ఆ ఆకాశం.
*******
ఇక్కడా జిలేబీ యే !
ReplyDeleteఇది నమో మాతా నమో నమః జిలేబి !
శిశిరాక్షతలు !
చీర్స్
జిలేబి
eppatilaagaane... chaalaa baagunnaaayi.
ReplyDeletethank you very much
Delete