ఉదయ వాహ్యాళి
లేలేత వలపుల తొలికిరణాల పలకరింపులలో
పై సొగసులనే దాచిన! పైటన ఈ సీమ అందాలు చూస్తుంటే
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది
ఒదిగి కూర్చున్న స్వేచ్ఛ రెక్క సాచి
సంధ్యకై హారతి పడుతున్న చిత్రాలవిగో
సద్దుమణిగిన నిన్నటి హ్లాద వేణియను మీటా
వికసిత కిసలయత్వాన! కళ్ళు తెరచిన పూబాలలవిగో
ఆ చిత్రాల ఛాయన ఈ వేణియ పాటల
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది
నిన్న పున్నమి రాతిరి ఒళ్లంతా వెన్నెల విభూతి పూసుకుంది
నేటి తొలి పొద్దున్న సంధ్య నేసిన కాషాయం గట్టింది
గట్టున కూర్చుని సన్యసిస్తుందేమో? ఈ చెరువని అనుకున్నా
అలల చేతుల ఆకసంతో వియ్యమొంది అది చేసిన కనువిందు చూసి
నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది
పరుగు పరుగున నే పోతూ ఉంటే ముత్యాలు మోమున పూస్తూ ఉంటె
నాకేవంటూ? ఆ సోయగాలని అమాయకంగా అడిగే నా నీడ చిటికెనవేలు పట్టుకుని
ఏడడుగులు నడిచింది ఆ ప్రకృతికాంత ఈ ఉదయవాహ్యాళి వేళ
అందుకే నా మనసు విరిసింది మధువని వోలె హృదయం పొంగి పారింది.
********
ఉదయపు వ్యాహాళి బాగుందండి.
ReplyDeletethank you
Delete