Monday, July 29, 2013

సాహసం

సాహసం
నా సాహసం 
ప్రియురాలి
 బుగ్గ ఎరుపు
****
మెరుపు
పేదవాడి 
ఆనందం
ఆకాశంలో మెరుపు
****
రంగవల్లి
రోజు రోజుకు 
 చెరిగిపోతున్న రంగవల్లి 
అడవితల్లి
****
కొత్త అత్తరు
మార్కెట్ లో 
కొత్త అత్తరు 
మట్టివాసన 
****
పరిణామం
అమ్మ గర్భం 
అద్దెకు 
ష్!.... పరిణామం 
*****
నూత్నదాంపత్యం
ఆమెతో ఆమె 
నాతో నేను 
నూత్నదాంపత్యం 
****
గూళ్ళు 
పిచ్చుకల గూళ్ళు 
పురాణేతిహాసాలు 
****
మూడ్
చావు, పుట్టుక, లంచం 
జీవితానికి 
'మూడ్' ఉండాలోయ్ మరి 
******

2 comments:

  1. రోజురోజుకూ చెరిగిపోతున్న రంగవల్లి అడవితల్లి....భేష్ రమేష్!!!

    ReplyDelete
  2. thank you very much surya prakash garu

    ReplyDelete