Thursday, August 1, 2013

మరుభూమి

మరుభూమి
ఆరిన దీపాలతోనే 
దీపావళి చేసుకుంటుంది 
ఆ మరుభూమి. 
*****
ఊహలు
విషాదాన్ని వేరు చేసి 
నాతో ఆనందపానం చేయించే 
హంసలు కాదటోయ్ 
నా ఊహలు. 
*****
విషాదం
ఎన్ని అశ్రుధారలనైనా 
కాదనక సేవించింది గానీ 
రెండంటే రెండు ఆనందబాష్పాలు 
తన గొంతు జారక 
ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతోందో చూడా విషాదం. 
*******
విలువలు
నాధుడనే వాడు వదిలేసాడని 
ఏనాడో పుస్తకమనే పుట్టిల్లు 
చేరాయా విలువలు. 
*******
కల
బద్దలై పోతున్నట్లు 
తెల్లారుతుండగా కలొస్తోందంటూ 
బావురుమంటున్నాయా కొండలీమధ్యనెందుకో 
*******

2 comments:

  1. బావున్నాయి. పేస్ బుక్ లో షేర్ చేయండి రమేష్ గారు . కవిత్వం అంటే ఏమిటో ... కాస్త కవిత్వం రుచి చూపినట్లు ఉంటుంది

    ReplyDelete
    Replies
    1. thank you very much for responding and for you suggestion also

      Delete