Monday, August 12, 2013

సిగపట్లు

సిగపట్లు
నన్ను సేద తీర్చాలని 
పాపం! తానెలా సిగపట్లు పడుతోందో చూశావా 
ఆ గాలి ఈ తోట లోని మానులతో. 
*******
తెలుగు భాష
ఉచ్ఛారణలో మనం సగం ఊపిరి తీస్తుంటే 
ఉదాసీనతలో తాను మిగిలిన ఆ ఊపిరిని 
పోగొట్టేసుకుంటోందా తెలుగుభాష. 
********
దీపం
చీకట్లోంచే వెలుగు పుట్టిందని చెప్పడానికో!
లేక ఎంతటి వెలుగైనా 
చీకటిపాల్ కావలసినదే అని చెప్పడానికో!
అలా ఆ చీకటినే చెంతనుంచుకుని వెలిగేది ఆ దీపం. 
*******

పసిపాపడు 
మాయమౌతూ ఆ నక్షత్రాలు వదులుకున్న 
తళుకులను ఒడిసిపట్టుకుని మరీ 
అమ్మ ఒడిలోంచి నిదుర లేస్తున్నట్లున్నాడు 
ఆ పసిపాపడు
********

4 comments:

  1. చెట్లు సిగ పట్టుకునేంత గాలి అవసరమా:-)

    ReplyDelete
    Replies
    1. :-) మీ స్పందనకు ధన్యవాదములు

      Delete
  2. మీ టపాలో చివరికవిత నాకు పరమ నచ్చింది!మీ పసిపాపడు కడు నచ్చినాడు!

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదములు

      Delete