Monday, July 15, 2013

ఆశ

ఆశ
నానిన ఎన్నో చొక్కాల తళుకులద్దుకుని!
తాను మెరిసి మాయమైపోయింది ఆ చొక్కా!
ఆశ పడకూడదా శ్రమలంటూ. 
********
గోదారి 
ఉన్ననాడా చేలో, లేనినాడా ఇసుకతెన్నెలపై
కమనీయంగా విందునొడ్డించి 
తానెంత మనసున్నదానినో 
చూడమంటుందా గోదారి. 
*******
అనుభవాలవిందు
కడుపునిండా తినకుండా 
తనకు తానే ఎంత బరువై తోచిందో,
కడుపునిండుగా మెక్కి 
తానంత తేలికైపోయింది నా మనసు!
అనుభవాలు విందు చేసే వేళ. 
*********
విలువలు 
వినోదాల విపణి వీధులకి!
హరివిల్లు వర్ణాలద్దుతున్నాయి 
తాము వివర్ణమై ఆ విలువలు. 
*********

4 comments:

  1. చక్కగారాశారండి.

    ReplyDelete
  2. అనుభవాలు విందుచేసేవేళ,వివర్ణమయిన విలువలు skvramesh బాగా చిత్రించారు!

    ReplyDelete