స్వప్నాలు
నే కన్న కలలన్నీ కరిగి
కనుజారి అలలైనాయని తెలిసి
చూడా సంద్రం తను కన్న
స్వప్నాలనెలా దాచుకుందో, ముత్యాలుగా.
********
స్వేచ్ఛ
తనను అణచి కూడా
ఆకాశమంత స్వేచ్ఛనిచ్చింది
ఈ మన్నేనని కాబోలు
మానైనా ఈ మన్నునొదలదా విత్తు.
********
బాల కార్మికులు
చమురంతా బయటకే ఒలుకుతుంది కనుకే
చీకటిని గడప దాటించలేని దీపాలు
ఆ బాలకార్మికుల నయనాలు .
********
ఆచారాలు
మెట్టినింటి ఆచారాలను
ఎంత అలవోకగా నేర్చుకుంటుందో చూడా నది
సాగరాన్ని సమీపిస్తూనే.
*********
baagunnayi.
ReplyDeletethank you
Deleteమీ బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేసుకోండి.
ReplyDeletehttp://blogvedika.blogspot.in/
thank you
Deleteచాలా బావున్నాయి
ReplyDeletethank you
Delete