శ్యామలధ్వజం
శ్యామలధ్వజాన్ని
పైకెత్తాయా చేలో
చేయి చేయి పట్టి ఆ వానచినుకులు.
*******
కొబ్బరాకు
వెన్నెల పట్టాభిషేకం చేసిన
నా పెరటి తోటకు
మకుటమై తానమరిందా కొబ్బరాకు ఛాయ.
*******
లోటు
ఆమె మోస్తున్న కడవలోకి తొంగి చూస్తూ
తనకు కాళ్ళు లేని లోటును
పూడ్చుకుందా ఆకాశం.
********
ముఖాముఖి
అదేమిటో! మాటలు సాగవు
మౌనాలు మిగలవు
నేను నా మనసు ముఖాముఖి ఎదురుపడినపుడు.
********
ఎవరో!
ఆదమరచి హాయిగా నిదరోతున్న
ఆ తోటలోని అందాలపై అన్ని ముత్యాలు చల్లి
తెల్లారకుండానే నిద్ర లేపిందెవరో!
*********
అన్ని వేటికవే చాలా బావున్నాయి
ReplyDeletethank you very much manju garu
Delete