మబ్బు తో మబ్బు చుంబిస్తేనేనా
మెరుపొచ్చేది అని ప్రశ్నిస్తుందా కిరణం
ఇసుక రేణువును చుంబిస్తూ.
******
తన తీర్మానాన్ని
స్వాగతించే కీచురాళ్ళకు
వ్యతిరేకించే మిణుగురులకు స్థానమిచ్చి
తనలోని ప్రజాస్వామికతను
చాటుకుంటుందా చీకటి.
*******
కలసి వేయాల్సిన ఏడు అడుగులను
ఒకరికొకరు వ్యతిరేకంగా
వేసుకుంటూ పోతున్నారా పాట పొదరింట
సంగీతమూ సాహిత్యమూనూ.
*******
పరిమాణంలో
భారత రామాయణ భాగవతాలు
మూడిటిని ముచ్చటగా
వెనక్కు నెట్టిందా నేతపైని
సి బి ఐ చార్జ్ షీట్.
*******
Good
ReplyDelete