ఒద్దికగా తన ఇంట్లోకొచ్చి
వయ్యారాన్నే తన ఇంటి పేరుగా
మార్చిందా వాన చినుకంటూ
ఒంపు ఒంపునా గట్టుతో చెబుతూ
పారుతుందా సెలయేరు.
********
అందమైనది గనుకే
నా మౌనం
దానికన్ని శత్రువులు.
******
తొలకరికా మట్టి
పువ్వైందని
వర్తమానమిచ్చిందా గాలి
నా మనసుకి.
******
ఎంత కాలమైనా
నాలో నీ ఆనవాళ్ళు
మాపడమనే విద్య
అబ్బింది కాదీ కాలానికి.
*******
చాలా బావుంది రమేష్ గారు.
ReplyDeletethnakyou srikanth garu
Delete