అన్ని ముత్యపు చిప్పలలో
ముత్యాలుంటాయో లేదో గానీ
అలాగుండే అందరి కళ్ళలో మాత్రం.......
******
కాలానికన్నా తానెక్కువ
కష్టపడుతున్నానంటుంది నా మనసు
ఊహల్ని కలల్ని రుజువులుగా చూపుతూ.
********
నా అన్న వాళ్ళు నలుగురితో
కలిసున్నానన్న ఆనందమే
మకరందమయిందా పువ్వులో.
********
నాటి నాయికల అందాలు
కావ్యాలకు కొత్త శోభలను తెస్తే
నేటి నాయికల అందాలు గోడలకు
నగ్న శోభలను తెస్తున్నాయి.
*******
No comments:
Post a Comment