కాలాన్ని అరువిచ్చి పుచ్చుకుంటూ
ఆ రుతువులు తనకు మాత్రం
తరగని వసంత శోభను కట్టిపెడుతున్నాయంటూ
మురిసిపోతోందా మృత్యువు.
******
అంత తొందరగా
చెట్టు నీడను వదిలిపెడుతుందా
బంధం బలమైనదైతే
స్వేచ్ఛతో పనేమిటంటూ
ఆ ఎండుటాకు.
*******
బద్ద శత్రువులైన
ఇద్దరు సమవుజ్జీల నడుమ
అధికార బదలాయింపును
ఎంత సులువుగా చేస్తుందా సంధ్య.
*******
అధికారంలోకి రాగానే
ఇచ్చిన హామీని
ఎంతందంగా నెరవేరుస్తుందో
చూడా దీపం.
*******
Excellent
ReplyDelete