పూలకి
గతజన్మ
జ్ఞాపకమా తేనెపట్టు.
******
నా మనసు లోతెంతో
చెప్పగలిగేవి
నా కన్నీళ్ళే.
*******
శ త్రువెంత సాధించినా
విజయాన్ని ఆ శత్రువుకే
అంకితమివ్వడం
ఒక్క దీపానికే చెల్లింది.
*******
బ్రతకడానికి కాలంతో పాటూ
పరుగెడుతున్న నన్ను చూసి
ఆయాసపడుతోంది నా నీడ
అవును నా కన్నా నా బ్రతుకు విలువ
దానికే తెలుసు మరి.
*******
బాగుంది!
ReplyDelete