ఆ రెండు మెట్ల నడుమ
లెక్కలేనన్ని విన్యాసాలు చేసేదే
జీవితమంటే.
*******
ఆ అడవి మానుల్ని అడిగి మరీ
ఒక దాని వెనుక ఒకటి క్రమంగా
వచ్చేవా రుతువులు
ఇపుడడగడానికి అవి లేవనే
బొత్తిగా క్రమశిక్షణ తప్పాయి.
*******
జీవితాల్లోకి తొందరొచ్చి
శుభకార్యానికి సగం
అశుభకార్యానికి మూడొంతులు
ఆయుష్షును తగ్గించేసింది.
*******
జీవితదశలు మారినంత
నిదానంగా కూడా
దశలు మారడం లేదా పాత్రలకు
డైలీ సీరియల్లో.
*******
No comments:
Post a Comment