హిమవసంతం
నాదైన ఈ తోటలో
కొమ్మ మీద కురుస్తున్న ప్రతి చుక్కా ఓ పూవైపోతుంటే
ఆ తావిని మోస్తూ గాలికి పట్టిన స్వేదం ముత్యాలౌతుంటే
రెక్క విప్పాతేటులు మయూరాలనే మించి ఆడుతుంటే
నా మనసున రేగిన మోదమంతా
తుషారమై ఈ తోటన పరచుకుంటే
అపుడు నా రెప్పల చప్పుడు ఆ కోకిలల పిలుపై తోచి
అందాల హిమనగాన్ని స్వాగతతోరణమై వెలయించి
ఆ వయ్యారి వసంతం తన విలాససౌధాన్నీ తోట గట్టుకుంటే
ఈ అందాలకు మైమరచి ఆ తొలిసంధ్య
పున్నమి జాబిలిని సాగనంపకుంటే ,
వాహ్యాళికని బయలుదేరినా ఇంద్రుడు మేఘాల చాటుగా
ఈ తోటను చూసి ఊహకందని స్వప్నమొకటి
వాస్తవమై వెలసిందని
చేయి సాచి నన్నీ తోటను దానమీయమని అడుగకుండునా?
**********
అడిగితే ఇస్తారా ఏంటి...అందమైన తోటను:-)Nice
ReplyDeletethank you :-)
ReplyDelete