శిల
శిల శిల్పమైనదని
నీడనిచ్చిన మాను
మెడలో హారమైనది.
******
కాంతిసీమ
కాంతిసీమకామె కాటుక రేఖను
కావలి బెట్టిందని కాబోలు
చీకటి ఖైదు లోకి
జారిపోయిందా మెరుపు తీగ.
********
ఆడది
అణచుకోవడం చేతకాక బ్రద్దలై
అది విశ్వమైంది గానీ
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ
ఆడదే అయ్యేదేమో.
********
బాల్యం
ఆట, పాట
అనురాగము, ఆప్యాయత అనే
నలుగురు బోయీలు మోసే
పల్లకీలో ఎక్కి ఊరేగి
ఎన్నాళ్ళయిందో ఆ బాల్యం.
********
ఆడది
ReplyDeleteBaagaa nacchindi.
వనజ గారు ధన్యవాదాలు
Deleteఅణచుకోవడం చేతకాక బ్రద్దలై
ReplyDeleteఅది విశ్వమైంది గానీ
అణచుకోవడం నేర్చి బ్రద్దలవకుంటే అదీ
ఆడదే అయ్యేదేమో.
చాలా బాగుందండి.
ధన్యవాదాలు
ReplyDelete