కష్టార్జితపు మత్తు
ఆమె పిల్లల ఆకలి మంటల్లో
ఆతని కష్టార్జితపు మత్తు
చమురు పోస్తుంది.
******
మౌనపు విత్తులు
నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని
విత్తులుగా చల్లుతూ, నా మనసున
ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి
నీ చూపులు.
********
అనుభూతులు
పరిగెత్తే లోకాన అనుభూతులకు
పెట్టుబడిగా పెట్టగలిగినంత కాలం నా దగ్గర లేదు.
అందుకే నాకు నేను కూడా అనుభవానికి రావడం లేదు మరి.
*******
కన్నీళ్లు
విడిచిన ప్రతి సారీ
గమ్యాన్ని చేరడం తెలిస్తే!
జీవితాంతమూ పోషించే వారెవ్వరూ చెప్పు ఈ కన్నీళ్లను.
*********
nice!!
ReplyDeletethank you very much
Deleteకష్టార్జితపు మత్తు ఇష్టార్జితమయి కుటుంబసభ్యుల కడుపులు నింపి మనుగడను కొనసాగిస్తుంది ఇలాంటి కవిత్వం గుండెలు నింపుతుంది!
ReplyDeletesurya praksh garu welcome to my blog and thank you very much
Delete'కష్టార్జితపు మత్తు ' ని అద్భుతంగా నిర్వచించారు.
ReplyDeletethank you very much
Delete