పాశుపతం
కాల మహిమో, కాదనలేని సమ్మోహనమో కాపోతే
లేలేత పసి నాల్కలే, పాశుపతాలై
పంచప్రాణాలు తీసేయడమేమిటోయ్ నా తెలుగుతల్లివి.
*********
కాన్వెంటులు
దాంపత్యం మొగ్గేస్తే చాలు
ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తున్నాయో చూడవోయ్
ఆ కాన్వెంటులు.
********
ముచ్చటైన గృహాలు
అమాశ రాతిరి తారలన్ని ఉండేవి నాడు.
నడుమ పున్నమి రాతిరన్ని ఐనాయి.
నేడో! వలసదెబ్బ తిన్న పల్లె వాకిట వెలిగే
వీధి దీపాలన్నీ కూడా లేవు గదటోయ్.
ముచ్చటగా మూడు తరాలు, మురిపాలు పంచుకుంటున్న గృహాలు.
*********
లంచం
నన్నడ్డుపెట్టుకుని నా జీవితారంభాని కన్నా ముందే
తన ప్రాభవాన్ని చూపగలిగేది,
అంతం తర్వాత కూడా తన ఉనికి చాటేది
ఏదైనా ఉన్నదంటే అది లంచమేనోయ్ నా దేశాన.
********
లంచం , కాన్వెంటుల గురించి కామెంటు కాదిది కాంప్లిమెంట్ .
ReplyDeleteశర్మ గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు ధన్యవాదములండి. ఇలానే విమర్శనాత్మక దృష్టితో నా రచనలు చదివి ఏది మంచి ఏది చెడు అని ప్రభోదిస్తూ నన్ను ముందుకు నడిపించగలరని మనవి.
Deleteకాన్వెంటులు...నిజంగా నిజం రాసారు. అన్నీ కూడానూ.
ReplyDeleteఅనూ గారు ధన్యవాదములు
ReplyDelete