చరిత్రకూ కాలాలు
యుద్ధం, వేసవి
ఆనక జారిన అందరి కన్నీళ్లు వర్షం
అలాటి యుద్దాలంటే
ఈ అవని వెన్నులో పుట్టిన వణుకు సీథాకాలమ్.
అవునోయ్ మనలానే మూడు కాలాలున్నాయి!
ఆ చరిత్రకీనూ.
*********
ఇంద్రధనుస్సు
పాపం తనకు
ఇంకో వర్ణాన్ని అరువీయమని
నా కన్నుల వెలసి ఆ ఇంద్రధనుస్సు
ఆశగా చూస్తుంది
నవ్వే ఆ పసోడి బోసినోరొంక.
*********
వాన చెట్టు
వాన చెట్టుని
పెంచాలనుందేమిటోయ్ నీకు.?
ఐతే అవిగో విత్తులు!
ఆ తామరాకుపై నీటి బొట్లు!
ఎక్క నాటమని అడుగుతావేమిటోయ్?
సుక్షేత్రమైన మనసుని
నీ దగ్గరుంచుకుని.
********
గురువు
ఇవి ఆడడం చూసి
ఆ నింగిలో మేఘాలు ఆట నేర్చాయ?
లేక అవి ఆడడం చూసి
తామరాకు మీద ఈ నీటిబొట్లు ఆట నేర్చాయా?
ఎవరు ఎవరికీ గురువో! కాస్త చూసి చెబుదు!
********
No comments:
Post a Comment