చెప్పవూ ప్లీజ్
జరిగింది చూస్తూ!
గెలిచిన భావవాదమందామా?
ఓడిన మానవతావాడమందామా?
ఆ! ఏదో ఒకటి అందామ్ ఎందుకులే అనే
నిట్టూర్పుల జడిలో కాసేపు మనసుని తడిపేద్దామా?
అవునోయ్ మరి!
మనకు సరిపడనిది, మనకు నచ్చనిది జరిగినపుడు
నిట్టూర్పు కన్నా నినాదమేముందోయ్! నేనూ మనిషిననడానికి
అందుకే ఆ తారలెందుకు రాలాయో!
వాటి తళుకెందుకలా గాయ పడిందో అక్కడే వదిలేద్దాం
అవును! కాగల కార్యం, ముష్కరులే చేశారని!
ఆ మృత్యువు హాయిగా శ్వాసించే వేళ
తల బ్రద్దలైపోయే భాద్యతలతో ఎవడికి వాడా?
తలకెక్కని భాద్యతలతో ఎవడికి వాడా?
అన్న చర్చ ఎందుకులే గానీ
రోజులు గడుస్తున్నాయన్న నిజం!
ఏ క్షణాన నాకు తెలీకుండా పేలిపోతుందో!
చెప్పవూ ప్లీజ్.
*********
నాకూ.....తెలియదు :-(
ReplyDeleteమీకు తెలిసినప్పుడు చెప్పండి ప్లీజ్
తప్పకుండా మీ స్పందనకు ధన్యవాదములు
Delete