అడియాశ
దేవుడెందుకో మనుషుల మనసులను
చాలా లోతుగా డ్రిల్లింగ్ చేస్తున్నాడోయ్
బహుశా మానవత కోసమంటావా?
పోనీలే అడియాశ అంటే ఏమిటో
ఆ దేవుడికీ తెలిసొస్తుంది.
********
ఉన్న చోటు
ఉన్న చోటెక్కడో చెప్పదు గానీ
విషాదమైనా ఆనందమైనా
తనువంతా కదిపిపారేస్తుంది
నా మనసు.
********
రాతి మనసు
ఏళ్ల తరబడి కదలకుండా
తపస్సెందుకు చేస్తున్నాయో ఆ బండరాళ్ళని
వాటికి చెవి ఆనించి ఎపుడైనా అడిగావా నువ్వు
లేదుగదా అందుకే
నీ మనసలా రాతిలా తయారైంది.
********
ఋతువులు
విలువల శిశిరం
కాసుల వసంతం
రెండే ఋతువులా సినిమా తెరకు.
********
రాతి మనసు బాగుంది:-)
ReplyDeletethank you
Delete