Friday, December 2, 2011

AALAYAM

తలుపులు మూసుకున్న
అంతరాలయంలో అందాల దేవుడు
తయారవుతున్నాడని
అందరికి తెలిసింది
ఆరితేరిన వారెందరో లెక్కలుగట్టి
దేవుడెప్పుడు బయటకొస్తాడో
తేల్చేసారు
దేవుడు బయట పడడం
సహజమేగా అనుకున్నారంత
కాని దేవుణ్ణి మించిన దేవుడొకడు
తెల్ల బట్టగట్టి వచ్చి
అసహజమైనదేదో జరగబోతోందంటు
పదునైన కత్తులతో
ఆ గుడి గోడలను మెత్తగా కోసి
మొత్తానికి దేవుణ్ణి బయటేసాననిపించి
యేవో లెక్కిస్తూ పోయాడు
ఆ అంతరాలయ పునరుద్ధ్ధారణలో
అయినవాళ్ళు మునిగారు.

No comments:

Post a Comment