Monday, September 16, 2013

జాబిలి -కలువ

జాబిలి -కలువ
నీ చెక్కిలిపై విలాసంగా నవ్వుతున్న 
నన్ను నేను చూడకనే 
కలువలై విచ్చిన నీదు కన్నుల జూచి!
ఎక్కడా? ఆ నిండు జాబిలని వెతికాను. 
*******
కొంటె కోణంగి
కవ్వించి, కవ్వించి నింగి వెలుగులను దాచేసే 
ఆ కొంటె కోణంగేనా! 
కరిగి, కొసరి కొసరి ఇన్ని అందాలను 
దానమిచ్చేదీ అవనికి. 
*******
గుణపాఠం
ఎదురు లేదంటూ చెలరేగే గాలికి, 
వెదురు తగిలి నేర్పే గుణపాఠం 
ఈ జన్మకు మరువగలవా నువ్వు. 
*******
చిరంజీవులు
పూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా,
నా దేశాన! ఆడదాని భయము,
మగవాడి అహంకారము రెండూ చిరంజీవులే.
 *********

3 comments:

  1. రమేష్ గారు మీ కవిత "చిరంజీవులు " ని నాకు బాగా నచ్చి FB లో షేర్ చేసాను.వితౌట్ పర్మిషన్. సారీ & ధన్యవాదములు .

    ReplyDelete