నా మనసు
లోకాన్ని ఒవైపుకు, నన్నోవైపుకు నెట్టేస్తూ
బలవంతానా ఓ విభజన రేఖను గీసిందెందుకో నా మనసు
పోనీ! లోకం వైపు ఓ అడుగేద్దాం, దాని అంతరంగాన్ని చదివేద్దాం అనుకుంటే
నీదే నిజమంటూ ఎక్కడలేని రాజసాన్ని నాకాపాదిస్తుంది
నా కనుసన్నల్లో మెలగాల్సిన కన్నెపిల్ల ఈ లోకమని నన్నొప్పిస్తుంది
తెలుసు! నన్ను చూసి పరిహసిస్తుంది ఈ లోకమని
తన తో పల్లవించని నాకై ఏ గాంధర్వాలనూ వినిపించదనీ తెలుసు
ఐనా ఎందుకో ఆ విభజనరేఖను దాటలేను నేను
నాకు అహమనుకో లేక నాపై నాకే అభిమానమనుకో, ఏమైనా అనుకో నువ్
గాయాన్నైనా గేయంలా మలచే మనసు నాకుందని మాత్రమే అనగలను నేను.
**********
మనసుని గూర్చి నిజం చెప్పారు, చాలా బాగా.
ReplyDeleteanu garu dhanyavaadamulu
ReplyDelete